telangana Ceo Vikas Raj about munugode bypoll మునుగోడులో ఉపఎన్నికలో భాగంగా నిన్న జరిగిన ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. 2 గ్రామాల్లో ఎన్నికల సిబ్బంది ఇతరుల దగ్గర నుంచి డబ్బులు, కొన్ని వస్తువులు పట్టుకున్నారని తెలిపారు. 2 పోలింగ్ స్టేషన్ లలో EVMలు బ్యాటరీ ప్రాబ్లం వచ్చిందని వాటిని సెట్ చేసినట్లు వివరించారు. 298 పొలింగ్ స్టేషన్లలో ప్రశాoతంగా పోలింగ్ జరుగుతుందని వికాస్ రాజ్ (Ceo Vikas Raj) వెల్లడించారు.
మునుగోడులో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికి మునగోడులో డబ్బుల కట్టలు బయట పడుతూనే వున్నాయి. ఇప్పటి వరకు రూ.8 కోట్లను అధికారులు సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్ హాల్‌లో వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వారు ఫంక్షన్ హాల్‌లో ఉన్నారని తెలుసుకున్న అబ్జర్వర్ అక్కడకు చేరుకుని.. వారి నుంచి మందు బాటిళ్లు, డబ్బులను సీజ్ చేసిన విషయం తెలిసిందే.