ఎన్నికల్లో పార్టీలు కాదు ప్రజలు గెలవాలి: సీఎం కేసీఆర్

-

నాగ్‌పూర్‌(Nagpur)లో బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని సీఎం కేసీఆర్(KCR) ప్రారంభించారు. పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్సవం సంద‌ర్భంగా గురువారం పార్టీ జెండాను గులాబీ బాస్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్‌(Nagpur)లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు.. పార్టీలు కాదని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ(BJP) ఓడింది.. కాంగ్రెస్ గెలిచింది. ఆ రెండు పార్టీల్లో ఎవరు గెలిచిలా లాభం లేదని.. పరివర్తన లేనప్పుడు ఎవరు గెలిస్తే ఏంటని ప్రశ్నించారు. అసలు భారత దేశ లక్ష్యం సమగ్ర అభివృద్ధి అని అన్నారు. మహారాష్ట్రలో ఉన్నన్ని నదులు ఎక్కడా లేవని.. అయినా రాష్ట్రంలో నీటి గోస తప్పడం లేదని అన్నారు. మహారాష్ట్ర(Maharashtra)లో ఇప్పుడున్న పరిస్థితులు మారాలని తెలిపారు. ప్రజా సమస్యలు పక్కనబెట్టి ఎన్నికల్లో గెలవడాన్నే పార్టీలు లక్ష్యంగా భావిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -

మహారాష్ట్రలో ఎన్నో పార్టీలు గెలిచాయని, కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోతున్నాయని అన్నారు. భారత రాజకీయాల్లో మార్పు కోసం బీఆర్ఎస్(BRS) ఒక మిషన్ లాగా పనిచేయబోతోందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా ఏ వర్గానికి కూడా పూర్తిగా మంచి జరుగలేదని వెల్లడించారు. సమాజంలో ప్రభుత్వాలు వివక్షను రూపుమాపకుంటే దళితుల పరిస్థితులు ఇలాగే ఉంటాయని గుర్తుచేశారు. అగ్ర దేశమైన అమెరికాలోనూ జాతి వివక్ష తీవ్ర స్థాయిలో ఉండేదని.. ఒబామాను అధ్యక్షుడిని చేసి ఆ పాపం కడుక్కుందని తెలిపారు. అలాగే భారత్‌లోని నిమ్న వర్గాల ముఖంలో చిరునవ్వు రావాలని.. ఆ పరిస్థితి కేవలం బీఆర్ఎస్‌తోనే సాధ్యమని అన్నారు. ముఖ్యంగా ప్రజలు మారాలని, ప్రజలు మారకుంటే ఎన్నికల్లో గెలుపోటముల డ్రామా నడుస్తూనే ఉంటుందని అన్నారు. ఇన్ని వనరులున్న దేశంలో విద్యుత్ సంక్షోభం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు.

Read Also:
1. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందంపై క్లారిటీ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...