MLC Candidates | ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

-

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను(MLC Candidates) కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ముగ్గురిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపినట్లు కే సీ వేణు గోపాల్ వెల్లడించారు. మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanthi), కేతావత్ శంకర్ నాయక్(Kethavath Shankar Naik), అద్దంకి దయాకర్(Addanki Dayakar) లు నామినేషన్ వేయనున్నారు. మార్చి 10 న నామినేషన్లకు చివరి తేదీ. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు… మల్లికార్జున్ ఖర్గే, కేసి వేణుగోపాల్ తో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం అభ్యర్థులను(MLC Candidates) ప్రకటించారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా 4 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా సిపిఐ కి ఒక సీటు కేటాయించారు.

Read Also: త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు – సీఎం రేవంత్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Atishi Marlena | బీజేపీ ఢిల్లీ ప్రజలను మోసం చేస్తోంది: అతిశీ

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ప్రజలను మోసం చేసారని ఆమ్ ఆద్మీ...

Revanth Reddy | త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు – సీఎం రేవంత్

ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)...