Telangana Congress | తెలంగాణ రాజకీయం మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హస్తిన బాటపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒకరి తర్వాత మరొకరు ఢిల్లీకెళ్లి మంత్రాంగం చేస్తున్నారు. టీబీజేపీ నేతలు ఈటల రాజేందర్(Eatala Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్(Komatireddy Rajagopal Reddy)లు రెండ్రోజులపాటు అధిష్టానంతో మంత్రాంగం నడిపితే, ఇప్పుడు టీకాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకెళ్లి హైకమాండ్‌తో కీలక మీటింగ్‌కి రెడీ అయ్యారు. కర్నాటక గెలుపుతో జోరు మీదున్న కాంగ్రెస్, అదే ఊపుతో తెలంగాణను కూడా కైవసం చేసుకునేందుకు అడుగులేస్తోంది. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒకవైపు చేరికలపై ఫోకస్ పెడుతూనే, ఇంకోవైపు గెలుపు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో స్ట్రాటజీ సమావేశం నిర్వహిస్తోంది అధిష్టానం. ఏఐసీసీ పిలుపుతో ఇప్పటికే ఢిల్లీకెళ్లిన టీకాంగ్రెస్(Telangana Congress) ముఖ్యనేతలతో భేటీకానున్నారు రాహుల్ అండ్ ఖర్గే. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy), ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, మల్లు రవి, మహేష్‌గౌడ్, సంపత్, సీతక్క, బలరాం నాయక్, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి పాల్గొననున్నారు.
Read Also:
1. తెలంగాణలో తామే కింగ్ మేకర్: MIM చీఫ్ కీలక వ్యాఖ్యలు
2. దారుణం.. భార్య ప్రియుడి రక్తం తాగిన భర్త!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat