కాంగ్రెస్ తొలి జాబితా అభ్యర్థుల లిస్ట్ రెడీ.. హైకమాండ్ ఆమోదం!

-

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ(Telangana Congress) ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం గాంధీభవన్ లో భేటీ అయిన పార్టీ ముఖ్య నేతలు టికెట్ల కేటాయింపు పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గాలవారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేయగా.. మరికొన్ని స్థానాలకు ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా 35 స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసి, ఈ జాబితాను ఏఐసీసీకి పంపిగా.. హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే దీనిపై టీపీసీసీ(Telangana congress) నేతృత్వం అధికారిక ప్రకటన చేయడం లేదు. ఈ నెల రెండో వారంలో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముందుగా సగానికిపైగా స్థానాల్లో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేయగా, పలుచోట్ల పోటీ పెరుగడం, ఆశావహులు హస్తినలో పైరవీలు చేయడం, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ పడటం వంటి కారణాలతో కొన్ని స్థానాలను తొలి జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల పేర్లు తొలి జాబితాలోనే ఉంటాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. 12 మంది మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న ముగ్గురు నేతలు ఎమ్మెల్యేలుగా బరిలో దిగనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేయడంపై ఏఐసీసీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, పొందెం వీరయ్య, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, చిన్నారెడ్డి, గీతారెడ్డి, వినోద్, గడ్డం ప్రసాద్.. ఎమ్మెల్యే బరిలో పోటీ చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా సీటు ఖాయమైనట్లు సమాచారం. కాగా తొలి జాబితాలో కొన్ని సెగ్మెంట్లకు ఎంపికైన అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లిస్టులో ఏయే పేర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

కాంగ్రెస్ తొలి జాబితా అభ్యర్ధుల లిస్ట్:

కొడంగల్ – రేవంత్ రెడ్డి

హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ – పద్మావతి

మధిర – భట్టి విక్రమార్క

మంథని – శ్రీధర్ బాబు

జగిత్యాల – జీవన్ రెడ్డి

ములుగు – సీతక్క

భద్రాచలం – పొందెం వీరయ్య

సంగారెడ్డి – జగ్గారెడ్డి

నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అలంపూర్ – సంపత్ కుమార్

నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి

కామారెడ్డి – షబ్బీర్ అలీ

మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు

ఆందోల్ – దామోదర రాజనర్సింహ

పరిగి – రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్ – గడ్డం ప్రసాద్

ఇబ్రహీంపట్నం – మల్రెడ్డి రంగారెడ్డి

ఆలేరు – బీర్ల ఐలయ్య

బాల్కొండ – సునీల్ రెడ్డి

ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి

పెద్దపల్లి – విజయ రమణారావు

చొప్పదండి – మేడిపల్లి సత్యం

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు

వరంగల్ తూర్పు – కొండా సురేఖ

వనపర్తి – చిన్నారెడ్డి

Read Also: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...