MLC Candidates | తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు అద్దంకి దయాకర్(Addanki Dayakar), విజయశాంతి(Vijayashanthi), శంకర్ నాయక్‌లు(Kethavath Shankar Naik) నామినేషన్‌లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సీపీఐ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
MLC Candidates | కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్(Dasoju Sravan) నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేత హరీష్ రావు, ఇతర నేతలు పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో 10మంది పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండువా కపపుకున్నారు. దీంతో ఆ పార్టీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ఒక్క సీటే దక్కింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెలిచింది.