ఏ పార్టీ దయాదాక్షిణ్యాలకు తలొగ్గం: సీపీఐ

-

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై సీపీఐ తెలంగాణ(Telangana) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు గురించి ఇప్పటివరకు అధికార బీఆర్ఎస్(BRS) నేతలతో ఎలాంటి చర్చలు తాము జరుపలేదని స్పష్టం చేశారు. ఏ నిర్ణయమైనా కేంద్ర పార్టీ సూచన మేరకు ఉంటుందని తెలిపారు. గౌరవప్రదంగా లేని ఎన్నికల పొత్తులకి కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటికీ తలవొంచబోవన్నారు. గెలుపైనా, ఓటమైనా ముందుకు సాగుతూనే ఉంటాయని, ఏ పార్టీ దయాదాక్షిణ్యాలకు తలవొగ్గేదే లేదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రజల కోసం పుట్టాయన్నారు. అధికారం లేకపోయినా వందేళ్లయినా పార్టీ ప్రతిష్టను ఎవ్వరూ తగ్గించలేరని పేర్కొన్నారు. అవసరమైతే తల ఇస్తాం.. కానీ తల వంచబోమన్నారు. ఇది తమ పార్టీల నిబద్దత అని, ఎవరికి ఇష్టమున్నా.. లేకపోయినా అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ(Telangana) శాసనసభలోకి అడుగుపెడతాయన్నారు.

- Advertisement -
Read Also: ఆ బాధ్యత నేను తీసుకుంటా.. మహరాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హామీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...