Telangana Elections |తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింది. గత నెలన్నరగా ప్రతి గల్లీలో దద్దరిల్లిన మైకులు మూగోబోయాయి. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకే ప్రచారం ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో 5 గంటలకు ప్రచారానికి తెరపడింది. దీంతో స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి స్వస్థలాలకు పయనమయ్యారు.
Telangana Elections |మొత్తం 119 నియోజకవర్గాలల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నవంబరు 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇక మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు 48 గంటల పాటు మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. మరోవైపు పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.