TSRTC PRC | టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. కొత్త పీఆర్సీ ప్రకటన..

-

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ నిర్ణయంతో 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుండగా.. ప్రభుత్వంపై రూ.35 కోట్ల భారం పడనుందన్నారు. అయినా కానీ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామని పొన్నం చెప్పారు.

- Advertisement -

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీ బస్సులు ఆక్యూపెన్సీ పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వడం ఇష్టం లేకపోతే విపక్షాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకానీ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టడం సరికాదని పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఏడాదికి రూ.15వేలు ఇస్తున్నామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...