Telangana government has solved the problem of nizam college students:నిజాం కాలేజీ యూజీ స్టూడెంట్స్‌కు ప్రభుత్వం శుభవార్త చేప్పింది. గత నాలుగు రోజులుగా తమకు హాస్టల్ వసతి కల్పించాలంటూ విద్యర్థులు చేస్తున్న ఆందోళన పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యార్థుల డిమాండ్‌లకు అంగీకరింనట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ‘‘గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థుల సమస్యను మానవతా దృక్పథంతో ప్రభుత్వం పరష్కరించింది’’ అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చరిత్రలోనే మొదటిసారిగా సీఎం ఆదేశాలకు అనుగుణంగా యూజీ విద్యార్థినులకు నిజాం కళాశాలలో హాస్టల్ వసతి కల్పించిందని పేర్కొన్నారు.
గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థుల సమస్యను మానవతా దృక్పథంతో ప్రభుత్వం పరష్కరించింది.@KTRTRS , @TelanganaCMO. pic.twitter.com/3ttFT7Nmof
— SabithaReddy (@SabithaindraTRS) November 11, 2022