Telangana | ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

-

Telangana |ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2.73 శాతం డీఏ పెంచుతూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం జూన్ 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు (పింఛనుదారులు)కు కూడా వర్తించనున్నట్లు మరో జీవోలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. పెంచిన డీఏను జూన్ నెల జీతంలో కలిపి జూలై 1వ తేదీన చెల్లించనున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదార్లకు లబ్ధి కలుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ(Telangana Govt) ఖజానాపై నెలకు రూ. 81.18 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ. 974.16 కోట్ల మేర భారం పడుతుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...