విద్యావ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం తెలంగాణ విద్యా కమిషన్(Education Commission) ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యారంగంపై సమగ్రమైన విద్యాపాలసీని తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది. చైర్మన్ తో పాటు విద్యారంగంలో నిపుణులైన ముగ్గురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. వీరి టెన్యూర్ రెండు సంవత్సరాలుగా నిర్ణయించింది ప్రభుత్వం. విద్యారంగంలో మార్పులు, విద్యావ్యవస్థ బలోపేతం కోసం ఈ కమిటీ పని చేయనుంది.
- Advertisement -