Telangana govt deposits Rythu bandhu funds into farmers accounts: తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.426.69 కోట్ల రైతుబంధు నిధులు విడుదల చేసింది. ఈ రైతుబంధు నిధులు 1,87,847 మంది రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. 8 లక్షల 53 వేల 409.25 ఎకరాలకు నిధులు విడుదల చేశారు. ఇప్పటి వరకు మొత్తం 56 లక్షల 58 వేల 484 మంది రైతుల ఖాతాలలో రూ.4754.64 కోట్లు జమ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. కరోనా ఇబ్బందులున్నా రైతుబంధు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అని కొనియాడారు. ప్రతి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వందశాతం కొనుగోళ్లు చేపట్టామని తెలిపారు.