ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాలు తెలంగాణ(Telangana) రాష్ట్రాన్ని జలమయం చేశాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులు, జలపాతాలని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద బీభత్సం కారణంగా ఇప్పటికే బుధ గురువారాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలు తగ్గకపోవడంతో సెలవుని పొడిగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రం(Telangana)లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది విద్యాశాఖ. శనివారం మొహరం కావడంతో.. విద్యార్థులకు వరుసగా మూడు రోజులు శుక్ర, శని, ఆదివారాలు సెలవులు ఉండనున్నాయి. దీంతో సోమవారమే తిరిగి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.