SC Classification Commission |ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఉపకులాల సమాచారం సేకరించి, ఎవరికి ఎంత రిజర్వేషన్ కల్పించాలన్న అంశాలపై ఈ కమిషన్ నివేదిక ఇటీవల ప్రభుత్వానికి అందించింది. కాగా ఈ నివేదికపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నివేదికను పునఃపరిశీలించాలన్న డిమాండ్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
షమీమ్ అక్తర్(Shameem Akhtar) ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని మరోసారి పెంచింది. ఏకసభ్య కమిషన్‌గా షమీమ్.. నవంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. సమగ్ర అధ్యయనం చేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ అరవై రోజుల గడువు జనవరి 10తో ముగిసింది. దీంతో ఫిబ్రవరి 10 వరకు ఈ కమిషన్(SC Classification Commission) కాలపరిమితి పొడిగించింది ఈ ప్రభుత్వం. తాజాగా ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని మరోసారి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిషన్ కాలపరిమితిని మార్చి 10 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.