SC Classification Commission | ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాలపరిమితి పొడిగింపు

-

SC Classification Commission |ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఉపకులాల సమాచారం సేకరించి, ఎవరికి ఎంత రిజర్వేషన్ కల్పించాలన్న అంశాలపై ఈ కమిషన్ నివేదిక ఇటీవల ప్రభుత్వానికి అందించింది. కాగా ఈ నివేదికపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నివేదికను పునఃపరిశీలించాలన్న డిమాండ్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

షమీమ్ అక్తర్(Shameem Akhtar) ఏకసభ్య కమిషన్‌ కాలపరిమితిని మరోసారి పెంచింది. ఏకసభ్య కమిషన్‌గా షమీమ్.. నవంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. సమగ్ర అధ్యయనం చేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ అరవై రోజుల గడువు జనవరి 10తో ముగిసింది. దీంతో ఫిబ్రవరి 10 వరకు ఈ కమిషన్(SC Classification Commission) కాలపరిమితి పొడిగించింది ఈ ప్రభుత్వం. తాజాగా ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని మరోసారి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిషన్ కాలపరిమితిని మార్చి 10 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Read Also: తెలంగాణ హైకోర్టులో విషాదం.. వాదనలు వినిపిస్తూ న్యాయవాది మృతి
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kodali Nani | మాజీమంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని(Kodali Nani)...

Manoj Bharathiraja | ప్రముఖ నటుడు, భారతీ రాజా కుమారుడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా కుమారుడు.. తమిళ నటుడు, చిత్రనిర్మాత మనోజ్...