Telangana |చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించి వారికి విద్యాబుద్దులు నేర్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు అంగన్వాడీ పోషకాహార కిట్‌లను కుడా అందిస్తోంది. అయితే.. వీటిని చిన్నారులకు సక్రమంగా అందించకుండా అంగన్వాడీ కేంద్రాల్లో(Anganwadi Centers) పనిచేసే వారు అక్రమాలకు పాల్పుడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల అక్రమాలపై ఇటీవల విడుదలైన నాని దసరా సినిమాలో క్లియర్‌గా చూపించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే గుడ్లపై వివిధ రంగులతో కూడిన తెలంగాణ ప్రభుత్వ స్టాంపు/ఎంబ్లెమ్‌ను ముద్రణతో పంపణీ చేసేందుకు నిర్ణయించింది. నిబంధనలు పాటించకపోతే ఏజెన్సీలు రద్దు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also:
1. అది నిరూపిస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జీవన్ రెడ్డి
2. తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త
Follow us on: Google News, Koo, Twitter, ShareChat