Telangana | బోనాల సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

-

తెలంగాణ(Telangana)లో బోనాల పండుగకు ఉన్న క్రేజే వేరు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ పండక్కి ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలో బోనాల సందడి మొదలైంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు, లష్కల్ బోనాలు ముగియగా.. హైదరాబాద్‌ వ్యాప్తంగా వచ్చే ఆదివారం జరుగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం (జులై 17) తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.

- Advertisement -

జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వం ఈ మేరకు సెలవు ప్రకటించింది. తెలంగాణ(Telangana) రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం జూలై 17 సోమవారం రోజున సెలవు ఉంటుంది. కాగా, ఇప్పటికే ఆదివారం బోనాల పండుగ సందర్భంగా 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: బోనాలకు ముస్తాబైన మహంకాళి ఆలయం

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...