వేములవాడ ఆలయ(Vemulawada Temple) అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అభివృద్ధి పనులను శరవేగంగా ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రూ.127.65 కోట్ల నిధులను మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ అభివృద్ధి పనుల్లో శ్రీరాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు సకల సదుపాయాలను కూడా మరింత విస్తరంగా మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందు కోసం ఇప్పటికే రూ.76 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
వేములవాడ ఆలయం(Vemulawada Temple) నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్టన్లు కూడా వెల్లడించిందీ ప్రభుత్వం. ఇందుకోసం భూసేకరణను కూడా ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు అధికారులు. ఈ భూసేకరణకు రూ.47.85 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. దాంతో పాటుగానే బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల వరకు డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.3.8 కోట్ల నిధులు విడుదల చేసిందని అధికారులు వెల్లడించారు.