ఎకరం కనీసం రూ.20కోట్లు.. బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ 

-

రోజురోజుకు విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నగర శివారులోనే ఎకరం రూ.100కోట్ల ధర పలికిదంటే భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతోంది. కోకాపేటలో నిర్వహించిన భూముల వేలంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో కోకాపేట తరహాలోనే బుద్వేల్ ప్రాంత భూముల అమ్మకానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని విక్రయించేందుకు సిద్ధమైంది.

- Advertisement -

Budwel lands

బుద్వేల్‌లో మొత్తం 14 ప్లాట్లను వేలం వేయనున్నారు. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాలుగా ఉంది. ఎకరాకు రూ. 20 కోట్ల కనీస ధర నిర్ణయించారు. ఆగస్టు 6వ తేదీన ప్రీబిడ్ సమావేశం, 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం.. ఆగస్టు 10వ తేదీన ఈ-వేలం నిర్వహించనున్నట్లు ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. బుద్వేల్ భూములు ఎకరాకు సగటున రూ.30 కోట్ల ధరకు అమ్ముడుపోయినా ప్రభుత్వానికి కనీసం రూ.3 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

కోకాపేట నియోపాలిస్ భూముల వేలం సర్కార్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. నగర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఎకరం రూ.100 కోట్లకు అమ్ముడుపోయింది. హెచ్ఎండీఏ ఎకరానికి కనీస ధర రూ.35 కోట్లకు బిడ్డింగ్ మొదలుపెట్టారు. ఆన్‌లైన్లో జరిగిన ఈ వేలంలో బడా రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడ్డాయి. ఈ వేలంలో అత్యధికంగా ఎకరం రూ.100.25 కోట్లు పలకగా.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లకు అమ్ముడుపోయింది. గురువారం జరిగిన ఫేజ్ 2 వేలంలో 6, 7, 8, 9 ప్లాట్ల వేలం వేయగా ప్రభుత్వానికి రూ. 1532.50 కోట్ల మేర ఆదాయం సమకూరింది. తర్వాత 10,11,14 ప్లాట్లను విక్రయించారు. దీంతో మొత్తం 45.33 ఎకరాలకు గాను రూ.2వేల కోట్ల ఆదాయం వస్తుందని భావించగా.. రూ.3,319కోట్ల ఆదాయం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...