Telangana | బీసీలకు లక్ష సాయంపై సర్కార్ గుడ్ న్యూస్

-

Telangana | రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం (6వ తేదీ) నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. తాజాగా.. రూ.లక్ష సాయం అందించేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం రూపొందించిన https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌ను సైతం మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ఆరంభించారు. ఈ పథకం కోసం కొందరి సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. తాజాగా కేబినెట్ సబ్ కమిటీ పథకం అమలుపై సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్ శుభవార్త చెప్పారు. బీసీలకు రూ.లక్ష సాయం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్న మంత్రి..ప్రతీ నెల 5వ తేదీ లోపు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఆ తరువాత ప్రతీ నెల 15న స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ.లక్ష సాయం అందించనున్నారు. సాయం అందిన వారు నెలరోజుల్లో పనిముట్లు కొనుక్కోవాలని మంత్రి కోరారు.

- Advertisement -
Read Also:
1. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ సంచలన వ్యాఖ్యలు
2. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో భారీ చోరీ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...