Telangana | చంద్రబాబు సర్కార్ పై సుప్రీం కోర్టుకి రేవంత్ సర్కార్

-

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల(Banakacherla), రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై(Rayalaseema Lift Irrigation Project) తెలంగాణ సర్కార్(Telangana) సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. స్టాండింగ్ కమిటీ, అడ్వకేట్ జనరల్‌తో చర్చించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్, గోదావరి రివర్ మేనేజ్‌‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా రివర్ మేనేజ్‌‌మెంట్ బోర్డు (కేఆర్‌‌‌‌ఎంబీ) నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, తెలంగాణ(Telangana) ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తే చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోమని ఉత్తమ్ హెచ్చరించారు.

“ఏపీ ప్రభుత్వం బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుండి అక్రమంగా నిధులు తెచ్చి, నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించనుంది. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాడు.. బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రజల తరుపున పోరాడి తీరుతాం” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు.

Read Also: నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...