Minister Tummala | రుణమాఫీకి ముహూర్తం పెట్టిన మంత్రి తుమ్మల

-

తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) తీపికబురు చెప్పారు. అనేక కారణాల ద్వారా మూడు నెలలుగా రుణమాఫీ అందని వారందరికీ రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. నవంబర్ 30న పాలమూరు వేదికగా జరిగే రైతుపండగ కార్యక్రమం సందర్భంగా తెలంగాణలో రుణమాఫీని(Loan Waivers) పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు మిగిలి ఉన్న 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ నగదు అందనుంది. వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఈ నగదును జమ చేయనుందని తెలిపారు తుమ్మల.

- Advertisement -

‘‘రైతుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కట్టుబడి ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర బడ్జెట్‌లో రైతుల కోసం రూ.47 వేల కోట్లు కేటాయించారు. అందులో ఇప్పటి వరకు రుణమాఫీకి రూ.18వేల కోట్లు, రైతుబంధుకు రూ.7,600 కోట్లు ఖర్చు పెట్టాం. రుణమాఫీ పంపిణీ విషయంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. అందువల్లే ప్రతి రైతుకు తొలి విడతలోనే రుణమాఫీని అందించలేకపోయాం. కొందరు రైతులకు తెల్లకార్డు లేకపోవడం, బ్యాంకు, ఆధార్ కార్డుల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాల వల్ల రాష్ట్రంలో 3 లక్షల మందికి రుణమాఫీ ఆగింది.

వ్యవసాయ శాఖ అధికారులు 3నెలలుగా వారందరి వివరాలు సేకరించి.. తప్పులను సరి చేశారు. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఈ నెల 30న మిగిలిన 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ నగదు ఖాతాల్లో జమవుతుంది. అదే విధంగా వచ్చే ఏడాది నుంచి ‘రైతు బీమా’ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని Minister Tummala వెల్లడించారు.

Read Also: పెళ్ళి పీటలెక్కనున్న అఖిల్.. నాగార్జున ఏమన్నాడంటే..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...