IAS Transfers |కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అంటకాగిన అధికారులపై బదిలీ వేటు తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అరవింద్ కుమార్ ను సైతం బదిలీ చేసింది. పురపాలక శాఖ (ఎంఏయూడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ (అదనపు), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (కమిషనర్) బాధ్యతల నుంచి తప్పించి విపత్తు నిర్వహణ శాఖ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ సీఎస్ గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎవరెవరు ఏయే శాఖలకు బదిలీ(IAS Transfers) అయ్యారంటే..
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి.వెంకటేశం
మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్
హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి
వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి
మహిళా-శిశు సంక్షేమ కార్యదర్శిగా వాకాటి కరుణ
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా ఆర్వీ కర్ణన్
అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్
జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అరవింద్ కుమార్
రోడ్లు-భవనాలు కార్యదర్శితో పాటు అదనంగా రవాణాశాఖ కార్యదర్శిగా శ్రీనివాస్‌రాజు
వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా
కాగా, ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన శ్రీనివాస్‌రాజు, శ్రీదేవికి తిరిగి పోస్టింగ్ ఇచ్చారు.
Read Also: హైదరాబాద్ చికెన్ లవర్స్ కి భారీ షాక్..!