తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల(IAS Officers) విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విడుదల చేశారు. పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసుల కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌ను నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా స్మిత సబర్వాల్ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనరుగా ఉన్న E. శ్రీధర్‌ను బీసీ వెల్ఫేర్ కార్యదర్శిగా బదిలీ చేశారు.
- Advertisement -
List of Transffered IAS Officers:
- దేవాదాయ శాఖ కమిషనర్ ఇ. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు
- మహిళ, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనిత రామచంద్రన్
- జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబరితి
- రవాణాశాఖ కమిషనర్‌గా కె. సురేంద్ర మోహన్
- ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సీహెచ్ హరికిరణ్
- ట్రాన్స్ కో సీఎండీగా డి. కృష్ణ భాస్కర్
- డిప్యూటీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్న కృష్ణభాస్కర్
- ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా శివశంకర్
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా సృజన
- ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎస్. కృష్ణ ఆదిత్య
ఏపీ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.