IPS Transfers |ఇప్పటికే పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తా మరో ఏడాదిన్నరపాటు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక రైల్వే డీజీగా మహేష్ భగవత్, తెలంగాణ స్పెషల్ ఫోర్స్ డీజీగా అనిల్‌కుమార్, సీఐడీ సీఐడీ చీఫ్‌గా శిఖా గోయల్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే మాజీ డీజీపీ అంజనీకుమార్‌కు సీఎం రేవంత్ రెడ్డి భారీ షాక్ ఇచ్చారు. ఆయనను ప్రాధాన్యత లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమించారు.
మిగిలిన ఐపీఎస్ అధికారుల బదిలీలు(IPS Transfers) ఇవే..
ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్‌రెడ్డి
ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి
సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్‌చంద్ర పవార్
సీఐడీ డీఐజీగా రమేష్ నాయుడు
హెడ్‌క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రమేష్
ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా కమలాసన్
జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా
పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్
విజిలెన్స్ డీజీగా రాజీవ్ రతన్