Aadi Srinivas | హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ చెంప చెళ్లుమందా..!

-

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతించారు. తాజాగా ఈ విషయంపై వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) స్పందించారు. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ చెంప చెళ్లుమనిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. అనర్హత విషయం నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు స్పీకర్‌కే ఉన్నాయని కోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని మాత్రం న్యాయస్థానం సూచించిందని, నిర్ణయం తీసుకోవడానికి నిర్ణీత కాల పరిమితిని కూడా కోర్టు విధించలేదని శ్రీనివాస్ వివరించారు.

- Advertisement -

ఇలానే జరుగుతుందని తెలిసి కూడా బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘‘రాజ్యాంగం ప్రకారం సభాపతి నడుచుకుంటారు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారు. కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయం లో ఎగిరెగిరి పడ్డారు. అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లుగా హడావిడి చేశాడు. చేసిన పాపం గోచి లో పెట్టుకొని కాశీ కి పోయినట్లు కేటీఆర్, బీఆర్ఎస్ నేతల తీరు ఉంది’’ అని సెటైర్లు వేశారు.

‘‘10 యేళ్ల పాటు రాజ్యాంగాన్ని అపహస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60 మంది కి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లను బీఆర్ఎస్ చేర్చుకుంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే లను క్యాబినెట్ లో చేర్చుకొని నైతిక విలువ లను కాళేశ్వరంలో కలిపారు. పార్టీలకు పార్టీలను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.

ప్రతిపక్ష పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్(KCR) లెక్కచేయలేదు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఫిరాయింపులు చేసుకోవచ్చునని నిర్లజ్జగా చెప్పుకొని తిరిగారు. అధికారం పోయిన తర్వాత రాజ్యాంగం, న్యాయస్థానాలు గుర్తుకు వచ్చాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్(BRS) ఖాళీ కావడం ఖాయం. ఐదారుగురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ లో ఉండరు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు, కేటీఆర్(KTR) గెస్ట్ హౌస్ కు, హరీష్ రావు(Harish Rao) నార్సింగి హౌస్‌కు పరిమితం కావాల్సిందే’’ అని Aadi Srinivas ఎద్దేవా చేశారు.

Read Also: ‘అవసరమైతే మళ్ళీ కోర్టుకెళ్తాం’.. అనర్హత పిటిషన్‌పై కేటీఆర్
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...