భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాహిత్య సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరవీరులను అవమానించే సంస్కృతి తమది కాదని, పూజించే సంస్కృతి అని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని పత్రికల వైఖరిపై విమర్శలు గుప్పించారు. సమైక్య రాష్ట్రంలో అవలంభించిన విధానాలనే ఇప్పుడు కూడా మీడియా సంస్థలు పాటిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణపై నిత్యం విషం చిమ్ముతూ, ప్రతి అంశాన్ని రాజకీయం చేసే ఆ పత్రికల మనసు మారాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు ఇక్కడి జ్యోతులు కావు అంటూ ఎద్దేవా చేశారు. పాఠశాలల్లో పిల్లలకు సాహిత్యం మీద పట్టు కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామని కవిత(MLC Kavitha) వెల్లడించారు.
Read Also:
1. కేసీఆర్‌ను బాటా చెప్పుతో కొట్టాలి.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
2. ‘9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేళ మళ్లీ పుట్టుకొచ్చింది’
Follow us on: Google News, Koo, Twitter, ShareChat