ఇక నుంచి హైదరాబాద్(Hyderabad) జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుగురు డీఎంహెచ్‌వోలు పనిచేయనున్నారు. చార్మినార్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లకు డీఎంహెచ్‌వోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డీఎంహెచ్‌వోల సంఖ్య 38కి పెరగనున్నది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇటీవల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో నెంబర్ 142ను గురువారం విడుదల చేసింది.
Hyderabad | ప్రస్తుతం రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, ఇందులో పేషెంట్లు, రద్దీకి అనుగుణంగా స్టాఫ్లేరు. పీహెచ్‌సీలను బలోపేతం చేసేలా స్పష్టమైన కేడర్ ఉండేలా స్టాఫ్‌ను ఏర్పాటు చేసేలా కొత్త నిబంధనల రూపకల్పన చేశారు. కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మరోవైపు గతంలో 30 మం డలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు.