Telangana High court Directs CS Somesh Kumar Returns to AP Cadre: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఏపీ కేడర్ కు వెళ్లాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయనను తెలంగాణ కేడర్ నుండి కేంద్రం రిలీవ్ చేసింది. సోమేశ్ కుమార్ ను ఏపీ కేడర్ కు కేటాయిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 12వ తేదీ లోపు (గురువారం) ఏపీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు సోమేశ్ కుమార్ ను ఏపీకి వెళ్లాలని తీర్పునిచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్రం రిలీవ్ ఆర్డర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
CS Somesh Kumar: తెలంగాణ కేడర్ నుండి సీఎస్ సోమేశ్ కుమార్ ఔట్
-