‘కృష్ణుడి రూపంలో NTR విగ్రహం పెట్టడానికి వీళ్ళేదు’

-

ఖమ్మం(Khammam) లక్కారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని(NTR Statue) ఏర్పాటు చెయ్యవద్దని హైకోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.ఖమ్మం లక్కారం లేక్ మధ్యలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై విధించిన స్టేను ఎత్తివేయాలంటూ నిర్వాహకులు వేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. శ్రీ కృష్ణుని రూపంలో విగ్రహ ఏర్పాటుపై వ్యతిరేకత రావటంతో మార్పులు చేసినట్టు నిర్వాహకుల తరపున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు చెప్పారు. విగ్రహం నుంచి నెమలి ఫించం, పిల్లన గ్రోవిని తొలగించినట్టు వివరించారు.`తానా´ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని పెడుతున్నట్టు చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న విగ్రహం ఫోటోలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఉన్నాయని చెప్పిన అదనపు అడ్వకేట్ జనరల్ ఫోటోలను కోర్టుకు సమర్పించారు. కాగా, విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారి తరపు వాదనలు వినిపించిన న్యాయవాది సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పబ్లిక్ ప్లేసులో విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. లేక్ వద్ద అనుమతి ఇస్తే చెరువు మధ్యలో దానిని పెడుతున్నారని చెప్పారు.

- Advertisement -

ఎన్టీఆర్ విగ్రహం(NTR Statue) పెట్టాలనుకుంటే ఆయన ధరించిన వేరే పాత్రల రూపంలో పెట్టుకోవచ్చన్నారు. అలా కాకుండా దేవుని రూపంలో విగ్రహం పెట్టటం ఏంటని ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటుపై స్టేని పొడిగించాలని కోరారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న రాంచందర్ రావు శ్రీ కృష్ణుని రూపంలో సినిమాల్లో నటించినపుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు? అని అన్నారు. శ్రీ కృష్ణుడు ఒక కులానికి దేవుడు కాదని, ప్రపంచం మొత్తానికి ఆరాధ్య దైవమన్నారు. దేవునికి కులాన్ని ఆపాదించటం సమంజసం కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయని అదనపు అడ్వకేట్ జనరల్ ఆర్డర్లను కోర్టుకు సమర్పించగా వాటిని కోర్టు కొట్టివేసింది.

Read Also:
1. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
2. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే మరి దేవుళ్లు ఎందుకు?
3. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి కొత్త చిక్కులు
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...