Telangana Elections |తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ముగిసింది. నామినేషన్ల పరిశీలన సోమవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,798 మంది నామినేషన్లు నమోదుకాగా.. 608 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా గజ్వేల్‌లో 145 నామినేషన్లు దాఖలైతే, అత్యల్పంగా నారాయణపేటలో 13 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రక్రియలో కీలక వ్యక్తుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
Telangana Elections | మాజీ మంత్రి కె.జానారెడ్డి, ఈటల రాజేందర్ భార్య జమున, బీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తు్న్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ తరపున ఈటల రాజేందర్, కోరుట్లలో బీఆర్ఎస్ తరపున విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ బరిలోకి దిగుతున్నారు. అయితే ముందు జాగ్రత్తగా వీరు డమ్మీ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వాటిని అధికారులు తిరస్కరించారు. బుధవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఉంది.
Read Also: అమరావతే రాజధానిగా కొనసాగింపు.. టీడీపీ-జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో..