ఏపీ మంత్రులపై మరోసారి హరీశ్ రావు సీరియస్

-

ఏపీ మంత్రులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కొందరు నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు, ఉన్నది అంటే ఉలుక్కి పడుతున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని ఇంత సీరియస్‌గా తీసుకున్న ఏపీ మంత్రులు.. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు.

- Advertisement -

‘విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాటం చేయడం లేదు.. పోలవరం పనులు ఎందుకు కావడం లేదని ప్రశ్నించాను. ఇందులో ఏమైనా తప్పుందా.? ప్రజల పక్షాన మాట్లాడాను తప్ప.. ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదు. తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అని చెప్పాను. ఏపీ ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండాలి అని చెప్పాను. మేము ఏపీ గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. తెలంగాణలో అన్ని బాగున్నాయి ఇక్కడే ఉండండి అనీ ఆరోజు అన్నాను’ అని చెప్పుకొచ్చారు. అయితే తాను ఏపీని కించపరచే విధంగా మాట్లాడాను అని కొందరు నాయకులు అనడం, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...