TGPSC | గ్రూప్-3 హాల్‌టికెట్ల విడుదల.. పరీక్ష సమయాలివే..

-

తెలంగాణ గ్రూప్-3 పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు TGPSC వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో పరీక్షలు జరగనున్నాయి. 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించారు అధికారులు. 18వ తేదీ ఉదయం 10-12:30 గంటల సమయంలో పేపర్-3 పరీక్ష జరగనుంది. ఈ గ్రూప్-3 పరీక్షలకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

అభ్యర్థులు అందరూ కూడా పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం జరిగే పరీక్షకు 9:30 తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2:30 తర్వాత పరీక్ష కేంద్రాల్లో ఎవరినీ అనుమతించమని వెల్లడించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్(TGPSC) నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పేపర్-1 పరీక్షకు తీసుకొచ్చిన హాల్‌టికెట్‌నే మిగిలిన రెండు పరీక్షలకు కూడా వినియోగించాలని, రోజుకో హాల్‌టికెట్ తెస్తే కుదరదని అధికారులు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ ముగిసే వరకు కూడా ఈ హాల్‌టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని సూచించారు.

Read Also: కుటుంబ సర్వే గలాటా.. ఆందోళన వద్దన్న మంత్రి పొన్నం
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...