హైదరాబాద్ HICC లో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్(Cybersecurity Conclave) – 2025 (షీల్డ్)ను రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్బంగా సైబర్ నేరాలు, సైబర్ భద్రతపై ఆయన మాట్లాడారు. ప్రజలందరికీ సైబర్ సేఫ్టీపై అవగాహన ఉండాలన్నారు. ఈ సందర్బంగా నిపుణులు మాట్లాడుతూ.. సైబర్ నేరాలను కట్టడి చేయడంలో తెలంగాణ టాప్‌లో నిలిచిందన్నారు. షీల్డ్-2025 సదస్సు రెండు రోజులపాటు జరగనుంది. ఇందులో ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈఓ రాజకుమార్ తోపాటు మరికొన్ని ఇంతమంది ఐటీ నిపుణులు పాల్గొన్నారు.
Cybersecurity Conclave | ఈ సందర్భంగానే క్రిప్టో కరెన్సీ, డీప్ ఫేక్ , డిజిటల్ ప్రపంచంలో మహిళల రక్షణ, మ్యూల్ ఖాతాలపైనా కృత్తిమ మేధ ద్వారా సైబర్ భద్రతకు అవగాహన కల్పించాలని నిపుణులు పేర్కొన్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా 22,812 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ జరిగిందని వివరించారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 1,20,869 సైబర్ నేరాలు సంభవించాయని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా 17,912 మంది బాధితులకు రూ.183 కోట్లను చెల్లించినట్లు నిపుణులు చెప్పారు.