బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు(Vidyasagar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు రెండో రాజధాని(Second Capital of India)గా తెలంగాణ అయ్యే అవకాశం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశానికి రెండో రాజధాని అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. రాజ్యాంగంలో ఈ అంశం ఉంది అంటూ తెలిపారు. తెలంగాణ బీజేపీలో ఎటువంటి ఇబ్బందులు లేవని.. ఒకవేళ ఉంటే వాటి విషయం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. దేశంలో మరోసారి బీజేపీ గెలుస్తుందని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యాక్తంచేశారు. మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తుందని ప్రజలు అదే కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీలో ఎటువంటి ఇబ్బందులు లేవని.. ఒకవేళ ఉంటే వాటి విషయం అధిష్టానం చూసుకుంటుందని ఆయన(Vidyasagar Rao) అన్నారు. దేశంలో మరోసారి బీజేపీ గెలుస్తుందని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తుందని ప్రజలు అదే కోరుకుంటున్నారని అన్నారు.