విచారణకి రండి.. వేణుస్వామికి నోటీసులు

-

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న వేణుస్వామి(Venu Swamy)కి తెలంగాణ మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 8 న నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాల(Sobhita Dhulipala) ఎంగేజ్మెంట్ చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. అదే రోజు సాయంత్రం వీరిద్దరి భవిష్యత్తుపై జ్యోతిష్యం చెబుతూ వేణు స్వామి ఓ వీడియో రిలీజ్ చేశారు. వీరిద్దరికి జాతకాలు కలవలేదని, శోభిత జాతకం అస్సలు బాగోలేదని, 2027 లో విడిపోతారని వివాదాస్పద జోస్యం చెప్పారు.

- Advertisement -

దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేశాయి. వీరి ఫిర్యాదు పై స్పందించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద వేణు స్వామిని పిలిపించి వివరణ కోరుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈనెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని వేణు స్వామి(Venu Swamy)కి ఆదేశాలు జారీ చేశారు.

Read Also: తెలుగు నటికి అరుదైన గౌరవం..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...