Teacher Beats intermediate students :ఇన్‌స్టాలో పోస్ట్‌.. కర్ర విరిగేలా కొట్టిన టీచర్‌

-

Telugu Teacher Beats intermediate students at kamareddy district: ఉపాధ్యాయురాలి ఫోటో తీసిన విద్యార్థులు.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ సోది క్లాస్‌ అని క్యాప్యన్‌ పెట్టారు. ఆనోటా.. ఈనోటా అనుకుంటూ ఉండటంతో.. చివరికి సదరు ఉపాధ్యాయురాలికి తెలిసింది. అంతే విచక్షణ కోల్పోయి.. ఆ పోస్ట్‌ పెట్టిందని ఎవరంటూ కర్ర విరిగేలా కొట్టింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని మేనూర్‌ ఆదర్శ పాఠశాలలోని జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదర్శ పాఠశాలలోని ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థినులు కొంతమంది, తెలుగు ఉపాధ్యాయురాలి ఫోటో తీసి.. సోది క్లాస్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

- Advertisement -

దీంతో ఈ విషయం టీచర్‌కు తెలిసి.. విద్యార్థులను పిలిపించారు. సదరు విద్యార్థి తల్లిదండ్రులకు సైతం సమాచారం అందటంతో.. తప్పయిందంటూ, మరొకసారి ఇలా చేయరంటూ క్షమాపణ కూడా చెప్పారు. అయినా కోపం తగ్గకపోవటంతో, సదరు విద్యార్థులను కట్టెలు విరిగేలా విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయురాలితో వాగ్వాదానికి దిగారు. టీచర్‌ను సస్పెండ్‌ చేయాలంటూ పాఠశాల ముందు నిరసన చేపట్టారు. అంతేగాకుండా ఆ టీచర్‌ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. (Telugu Teacher Beats intermediate students) ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...