BRS MLA Ticket | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు సైతం అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సమయంలోనే అధికార బీఆర్ఎస్‌లో ఇవాళ ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేయనున్నారు. తొలివిడత అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు విడుదల అవుతున్నదని తెలియడంతో కొన్ని చోట్ల సిట్టింగ్‌లతో పాటు ఆశావహులు తమకే టికెట్ వస్తుందని అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సిట్టింగులు కేడర్‌ను పట్టించుకోవడం లేదని, వారికి టికెట్ ఇవ్వొద్దనే నిరసనలు మొదలయ్యాయి.
BRS MLA Ticket | ఫలానా వ్యక్తికి టికెట్ కేటాయించాలని వారి అనుచరులు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి బయటపడుతున్నది. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 104 మంది అధికారపార్టీకి చెందిన వారే. ఇందులో దాదాపు 13 నియోజకవర్గాల్లో అసంతృప్తి బయటపడుతున్నది. దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.