ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంలో పలువురు నటులు, ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారిలో యాంకర్ శ్యామల(Anchor Shyamala) కూడా ఉన్నారు. కాగా తాజాగా ఆమె తనపై దాఖలు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. శ్యామలను అరెస్టు చేయవద్దంటూ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అదే విధంగా పోలీసుల విచారణకు పూర్తి సహాకారం అందించాలని శ్యామలను ఆదేశించించి కోర్టు. సోమవారం నుంచి పోలీసుల విచారణకు హాజరుకావాలని, శ్యామల విచారణను నోటీసు ఇచ్చి కొనసాగించవచ్చి హైకోర్టు తెలిపింది.