GO 16 కు హైకోర్టు బ్రేకులు.. ఊపిరి పీల్చుకున్న నిరుద్యోగులు..

-

జీవో 16(GO 16) విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో 16ను తీసుకొచ్చింది. సెక్షన్ 10 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను హైకోర్టు ఈరోజు కొట్టేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్దీకరించింది. కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన GO 16 ను తెలంగాణ నిరుద్యోగులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. వారి పిటిషన్‌ను స్వీకరించి విచారణ చేపట్టిన కోర్టు.. ఈ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

అయితే రాష్ట్రంలో 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వ క్రమబద్దీరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, 131 మంది సాంకేతిక విద్యాశాఖ అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలో 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు ఉన్నారు.

Read Also: పోలీసుల విచారణకు ఆర్‌జీవీ గైర్హాజరు.. వాట్సప్‌లో మెసేజ్..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...