TG High Court | రేవంత్‌పై కేసులు నమోదు చేసే ఆదేశాలివ్వండి.. నో చెప్పిన హైకోర్టు

-

బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన తెలంగాణ హైకోర్టును(TG High Court) ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. అనంతరం పిటిషనర్ శ్రీనివాస్‌(Errolla Srinivas) కు భారీ షాక్ ఇచ్చింది. ఆయన కోరిన విధంగా ఆదేశాలు జారీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

‘‘సీఎం అనేక సమావేళల్లో అనేక అంశాలపై మాట్లాడుతుంటారు. ఆ సందర్భంల్లో ఏదో మాట్లాడారని, వాటిని తప్పులుగా పరిగణిస్తూ కేసులు నమోదు చేయమని ఆదేశాలు ఇవ్వలేము’’ అని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు(TG High Court) వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్బంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సమావేశంలో ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

Read Also: సచివాలయంలో మార్పులపై హరీష్ రావు ఫైర్..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...