బెట్టింగ్ యాప్‌లను(Betting Apps) ప్రమోట్ చేసిన కేసులో యాంకర్, నటి విష్ణుప్రియ(Vishnu Priya).. హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. మియాపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలన్న విష్ణుప్రియ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. దర్యాప్తుపై స్టే విధించడం కూడా కుదరదని తెలిపింది. అంతేకాకుండా పోలీసుల దర్యాప్తుకు పూర్తి సహకారం అందించాలని విష్ణుప్రియకు ఆదేశించింది. అదే విధంగా ఈ విషయంలో చట్టం ప్రకారమే ముందుకు వెళ్లాలని పోలీసులకు సూచించింది.