TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

-

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం విచారణ ముగిసింది. కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ తరపును సీనియర్ న్యాయవాది మోహన్‌రావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని తెలిపారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న సీజే దర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.

- Advertisement -

కాగా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి(Kadiyam Srihari), దానం నాగేందర్‌(Danam Nagender)పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. హైకోర్టు(TG High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ బెంచ్.. అనర్హతపై నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని, ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా తమకు తెలపాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు.

Read Also: ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...