తెలంగాణ సీఎస్ శాంతికుమారిపై హైకోర్టు(TG High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించి తీరాలని తెలిపింది. ఒక ప్రైవేటు ల్యాండ్‌కు సంబంధించిన కేసులో సీఎస్.. కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో న్యాయస్థానం మండిపడింది. మార్చి 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని, లేకపోతే కేసును సీబీఐ లేదా ఈడీకి అప్పగిస్తామని స్పష్టం చేసింది. ఇంతకీ కేసు ఏంటంటే.. శేర్లింగంపల్లి(Serilingampally) మండలంలోని సర్వే 66/2 ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో కలెక్టర్ ఎన్వోసీ జారీ చేశారు. ఈ క్రమంలో ఎన్ఓసి జారీ చేయడానికి కలెక్టర్ కు ఉన్న అధికారం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సీఎస్ శాంతికుమారి(CS Shanti Kumari) పట్టించుకోకపోవడంతో హైకోర్టు(TG High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.