TGSPSC గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల

-

TGPSC Group 2 Exams |టీజీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేసింది. డిసెంబర్ 15,16 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మూడు సార్లు గ్రూప్-2 వాయిదా పడింది. ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీ పరీక్షలు కూడా అదే సమయంలో ప్రారంభం కావడంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసింది. దీంతో మరోసారి పరీక్షల తేదీలు ఖరారు చేసింది. పరీక్షలకి వారం రోజుల ముందు నుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీఎస్పీఎస్సీ వెల్లడించింది. కాగా, మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

TGPSC Group 2 Exams Schedule:

డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1

డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-2

డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3

డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-4

Read Also: పార్టీ జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...