TGPSC | గ్రూప్-1 రిజల్ట్స్ వచ్చేదప్పుడే..

-

తెలంగాణలో గ్రూప్-1(Group 1) పరీక్షలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఒకవైపు అభ్యర్థులు పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లి ధర్నాలు చేస్తున్న క్రమంలో ఇచ్చిన తేదీకే పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇంతటి హైటెన్షన్ వాతావరణంలో జరిగిన ఈ పరీక్షల ఫలితాల విడుదలకు టీజీపీఎస్‌సీ(TGPSC) ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 10 నుంచి 18 మధ్య గ్రూప్-1, 2, 3 ఫలితాలను వెల్లడించనున్నట్లు టీజీపీఎస్‌సీ ఛైర్మన్ వెంకటేశం వెల్లడించారు.

- Advertisement -

ఇందులో భాగంగానే మార్చి 10న గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటించడానికి టీజీపీఎస్సీ(TGPSC) తుది పరిశీలనలు కొనసాగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే.. మార్చి 10న గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి. అదే రోజు అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల వివరాలను వెల్లడవుతాయి. ఆ తర్వాత అభ్యర్థుల సర్టిఫికెట్ వెరికేషన్ ప్రక్రియ ఉంటుంది. మార్చి 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను అనౌన్స్ చేస్తారు. 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను కమిషన్ వెల్లడిస్తుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదల చేస్తారు.

Read Also: రేవంత్ మొద్దు నిద్ర వీడాలి..హరీష్ రావు
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...