నల్లమల అడవులను(Nallamala forest ) అదానీకి అప్పగించే కుట్ర జరుగుతున్నగదని గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్న వ్యాఖ్యలు రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ వ్యాఖ్యలు అందులో భాగమేనన్నారు. గురువారం సుందరయ్య పార్క్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నదన్నారు. గిరిజనులు వ్యతిరేకించి, ఉద్యమిస్తుండటంతో ప్రభుత్వం వెనక్కు వెళ్లిందన్నారు. ప్రజా పోరాటాలకు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలను అదానీ గ్రూపునకు కట్టబెట్టేందుకు సిద్ధపడిందని ఆరోపించారు.
Read Also: సైకో సీఎం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి: లోకేష్
Follow us on: Google News, Koo, Twitter