బీజేపీకి రాజీనామా చేసిన తుల ఉమ(Thula Uma) బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్(KTR) ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి ఉమక్క ఘటనే నిదర్శనమన్నారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి.. బీఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరమన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రగల్భాలు పలికిన బీజేపీ(BJP) తుల ఉమను తీవ్రంగా అవమానించిందన్నారు. కేసీఆర్(KCR) సూచన మేరకు ఆమెకు పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు.
బీసీ వ్యక్తిని బీజేపీ సీఎం చేసేది ఓ కల మాత్రమే అని తుల ఉమ(Thula Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి కేటాయించారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌లో చేరడంతో సొంత గూటికి వచ్చినట్లు ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఇవాళ ఉదయం బీజేపీకి ఆమె రాజీనామా చేసిన సంగతి తెలసిందే. ఈ సందర్భంగా బీజేపీ అధిష్టానంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.