దేశంలోని అన్ని కూరగాయల మార్కెట్లలో టమాటా ధర(Tomato Prices) కిలో రూ.100కి చేరింది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెల క్రితం టొమాటోలు కిలో రూ. 15 నుంచి 20 రూపాయల వరకు విక్రయించారు. అయితే ఒక్క సారిగా ఒక నెలలోనే ధర 100 రూపాయలకు చేరింది. గత మూడు నాలుగు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా టమాట షాటేజే రావడంతో ధర పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో టమాటాల సప్లై సరిగ్గా లేకపోవడంతో పశ్చిమ్ బెంగాల్, ఒడిశా నుంచి తెప్పించుకుంటున్నారు. కొందరైతే.. బంగ్లాదేశ్నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో సైతం మార్కెట్లలో టమాటా ధరలు(Tomato Prices) రూ.80 నుంచి 100 పైగా ధరలు పెంచారు. నగరంలోని రైతు బజార్లలో పచ్చిమిర్చి కిలో రూ.120 పలుకగా, పొరుగు మార్కెట్లలో రూ.150 అంతేకాకుండా, బీన్స్, వంకాయ, ఐవీ పొట్లకాయ వంటి ఇతర కూరగాయల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
Read Also:
1. పూనకాలు తెప్పిస్తోన్న పవన్ కల్యాణ్ సినిమా కొత్త పోస్టర్
2. హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలేంటి? న్యాచురల్ గా ఎలా పెంచుకోవచ్చు?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat